ఎండాకాలం వైరస్ వ్యాప్తి చెందదా.. ఎవరు చెప్పారు!!

ఎండాకాలం వైరస్ వ్యాప్తి చెందదా.. ఎవరు చెప్పారు!!

ఇంతకాలం అదే అనుకుంటూ వస్తున్నారు. ఎండవేడిమికి వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పడుతుంది అని. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కరోనా వైరస్ అంచనాలను మించి స్థిరంగా వ్యాప్తి చెందుతోందని.. వేడి, ఉక్క వాతావరణం వైరస్‌ని ఏమాత్రం అడ్డుకోవడం లేదని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్లు ది జర్నల్ ఆఫ్ సైన్స్ పేర్కొంది. వాతావరణ పరిస్థితులు అడ్డుకోలేకపోవడంతో చాలా మంది కొవిడ్ బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. బ్రెజిల్, ఈక్వెడార్ వంటి చోట్ల వైరస్ వ్యాప్తి అంతగా లేదు. వాతావరణ పరిస్థితుల ప్రభావం అనుకున్నారు. కానీ రాను రాను అక్కడ కూడా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో తమ అంచనాలు తప్పని తెలుసుకున్నారు. వేడి వాతావరణం వైరస్ వ్యాప్తి వేగాన్ని తగ్గింపజాలదని ప్రిన్స్‌టన్ ఎన్విరాన్‌మెంటల్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకుడు రేచల్ బేకర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story