జూన్‌‌లో సినిమా షూటింగ్ సందడి..

జూన్‌‌లో సినిమా షూటింగ్ సందడి..
X

లాక్డౌన్ ఈనెలాఖరుతో ముగియనుంది. అనతరం సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను సినీరంగ ప్రతినిధులు కోరారు. సినీ ప్రముఖుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారని, షూటింగ్‌లు జూన్‌లో ప్రారంభించుకోవచ్చని చెప్పారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లు, రీ ప్రొడక్షన్‌లను దశల వారీగా పునరుద్ధరిస్తామని సీఎం అన్నారు. కొవిడ్ నివారణ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు జరిగేలా చూడాలన్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ షూటింగ్స్ నిర్వహించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజు, సి. కళ్యాణ్, ఎన్. శంకర్, కొరటాల శివతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Next Story

RELATED STORIES