ఎన్టీవోడి అభిమాని వైవియస్ చౌదరి బర్త్ డే ఈ రోజు

ఎన్టీవోడి అభిమాని వైవియస్ చౌదరి బర్త్ డే ఈ రోజు

కొన్నాళ్ల క్రితం.. ఎవరైనా దర్శకుడు కావాలంటే అప్పటికే స్టార్ అయిన మరో దర్శకుడి వద్ద అసిస్టెంట్ గా చేయాలి. తర్వాత వీళ్లు దర్శకులైతే.. వీళ్లు ఫలానా స్కూల్ నుంచి వచ్చారు అని చెప్పేవారు. కానీ వైవియస్ చౌదరికి అలా చెప్పలేం. ఎందుకంటే ఆయన చాలా స్కూల్స్ కు వెళ్లాడు. అవన్నీ డిఫరెంట్ స్కూల్స్. ఏ స్కూలూ మరో స్కూల్ లా ఉండదు. అందుకే వైవియస్ కూడా వైవిధ్యమైన సినిమాలే చేశాడు. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా, టాలీవుడ్ లో తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీవోడి అభిమాని వైవియస్ చౌదరి పుట్టిన రోజు ఇవాళ (మే 23).

ఫలానా వారి మీద అభిమానంతోనే పరిశ్రమకు వచ్చాను. ఈ మాట చెప్పని సినిమావాళ్లు అరుదు. ఆఖరికి వారసులుగా వచ్చిన హీరోలు కూడా ఇదే చెబుతున్నారు. అలాగే వైవియస్ కూడా చిన్నప్పటి నుంచి నందమూరి తారకరామారావు అభిమాని. అలాగే సినిమాకూ వీరాభిమాని. సినిమా పరిశ్రమలోకి రావాలనుకోవడానికి ఇది చాలదు. అయితే వైవియస్ ఒక్కరిద్దరు కాకుండా వైవిధ్యమైన దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేయడం విశేషం.

ఫస్ట్ మూవీకే ప్రతిభావంతుడైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు వైవియస్ చౌదరి. పైగా అక్కినేని వంటి స్టార్ ను మెప్పించాడు. దీంతో నెక్ట్స్ ఛాన్స్ కూడా అన్నపూర్ణ బ్యానర్ నుంచే వచ్చింది. ఈ సారి మల్టీస్టారర్ అనదగ్గ చిత్రం. తన అభిమాన నటుడు ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేసే చాన్స్ మిస్ అయినా.. ఆయన తనయుడు హరికృష్ణను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. నాగార్జున, హరికృష్ణ హీరోలుగా వచ్చిన ఆ సినిమా సీతారామరాజు.. ఇది కూడా మంచి విజయం సాధించింది.

మూడు సినిమాలతో వైవియస్ చౌదరి తనకంటూ ఓ సెపరేట్ రూట్ సెట్ చేసుకున్నాడు. టేకింగ్ బావుందనే పేరొచ్చింది. పాటలూ బాగా తీస్తున్నాడన్నారు. కానెందుకో సడెన్ గా తనే నిర్మాతగా మారాడు. బొమ్మరిల్లు పతాకంపై తొలి సినిమాగా లాహిరిలాహిరి లాహిరిలో చిత్రాన్ని నిర్మించాడు. భారీతారాగణంతో నిర్మించిన ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అన్ని ఎమోషన్స్ ను అద్భుతంగా క్యారీ చేయించాడీ సినిమాతో.

వరుసగా విజయాలు వచ్చేసరికి వైవియస్ కు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అందుకే ఏ ఇమేజ్ లేని ఇద్దరుని హీరో హీరోయిన్లు గా తీసుకుని ఏకంగా 12కోట్ల బడ్జెట్ తో సినిమా చేశాడు. ఈ సినిమాతో వైవియస్ బ్యానర్ మూతపడటం ఖాయం అన్న కామెంట్స్ కూడా వచ్చాయి. అన్నట్టుగానే ఆ సినిమా ఫస్ట్ వీక్ ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ నెక్ట్స్ వీక్ నుంచి మొదలైన విజయోత్సవం వంద రోజుల వరకూ కొనసాగింది. ఆ సినిమానే దేవదాసు. ఆ ఇద్దరే ఇప్పటి రామ్, ఇలియానా.

వైవియస్ చౌదరి ప్రతిభావంతమైన దర్శకుడు. అందులో ఎవరికీ డౌట్స్ లేవు. కానీ కాలం కలిసి రానప్పుడు ఎంత టాలెంటెడ్ అయినా కామ్ అయిపోవాల్సిందే. ప్రస్తుతం కొత్తతరం కథల్ని రెడీ చేసుకుంటోన్న వైవియస్ మళ్లీ తనదైన శైలిలో విజయపతాకం ఎగరేయాలని కోరుకుందాం.

Tags

Read MoreRead Less
Next Story