రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు ఆశాజనకంగా లేదు: నీతి ఆయోగ్ సీఈఓ

రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు ఆశాజనకంగా లేదు: నీతి ఆయోగ్ సీఈఓ

వలస కార్మికుల విషయంలో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వలస కార్మికులను సొంత ప్రాంతాలు తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాలపైనే ఉందని అన్నారు. ఈ లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయింది వలస కార్మికులు. సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు వలస కార్మికులు వందల కిలోమీటర్లు కాలినడకన వెళ్తున్నారు. తమ రాష్ట్రానికి చెందిన కూలీలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తరలించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను తరిలిస్తున్నారు. అయితే, కార్మికుల తరలింపు విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు ఆశాజనకంగా లేదని.. మరింత మెరుగ్గా పనిచేయాలని నీతిఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వాల పాత్ర పరిమితంగా ఉంటుందని.. అయితే.. ఇలాంటి విపత్కర సమయంలో మాత్రం ప్రజల రక్షణ బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుందని అన్నారు. చివరి కార్మికుడు కూడా ఇంటికి చేరేవరకూ ప్రభుత్వమే పనిచేయాలని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story