అతడినే పెళ్లాడాలని.. ఆమె ఒంటరిగా 80 కిలోమీటర్లు..

అతడినే పెళ్లాడాలని.. ఆమె ఒంటరిగా 80 కిలోమీటర్లు..
X

ప్రేమ కోసం ఖండాతరాలు దాటే ప్రేమికులను చూశాం. పెళ్లి కోసం లాక్డౌన్ వేళ 80 కిలోమీటర్లు నడిచింది ఓ పెళ్లి కూతురు. భుజాన బట్టల బ్యాగు తగిలించుకుని ఒక్కతే ఒంటరి ప్రయాణం చేసింది యూపీ కాన్పూర్ పరిధిలోగల మంగల్పూర్ గ్రామ నివాసి గోల్డీ. 12 గంటల పాటు నడిచి వరుడు వీరేంద్ర కుమార్ రాథోడ్ ఉంటున్న బౌస్సూర్ గ్రామానికి చేరుకుంది. వరుని కుటుంబ సభ్యులకు ఆమె వచ్చే విషయం తెలియదు. దాంతో గోల్డీని చూసి కంగుతిన్నారు. వెంటనే వధువు కుటుంబసభ్యులతో మాట్లాడారు. రెండు కుటుంబాల సమ్మతితో వరుడి గ్రామంలోని ఓ ఆలయంలో గోల్డీ, వీరేంద్రల వివాహం జరిగింది. ఆహారం ఏమీ తీసుకోకుండా 12 గంటల్లో 80 కిలోమీటర్లు నడిచానని గోల్డీ తెలిపింది. పెద్దల సమక్షంలో తమ వివాహం జరగడం ఆనందంగా ఉందని అంటోంది.

Next Story

RELATED STORIES