డాక్టర్ సుధాకర్ ఘటనతో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏంటో అర్ధమవుతోంది: ఎమ్మెల్సీ మాధవ్

X
TV5 Telugu24 May 2020 1:48 PM GMT
ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా పనిచేయలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ పి.వి మాధవ్. డాక్టర్ సుధాకర్ ఘటనతో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏంటో అర్ధమవుతుందన్నారు. సుధాకర్ కేసును హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడాన్ని ఆయన స్వాగతించారు. బిల్డ్ ఏపి పేరుతో ప్రభుత్వ భూములను చౌకగా బినామీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాధవ్ ఆరోపించారు. ప్రభుత్వ భూముల అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story