Top

దుష్యంత్ దాతృత్వం.. 600 మంది వలస కూలీలకు..

దుష్యంత్ దాతృత్వం.. 600 మంది వలస కూలీలకు..
X

ముస్లిం సోదరులు రంజాన్ పవిత్ర మాసంలో రోజుకి 5సార్లు నమాజు చేస్తుంటారు. అల్లాను భక్తితో ప్రార్థిస్తుంటారు. అన్నార్తులకు సాయం అందించడంలో ఆనందాన్ని పొందుతారు. అయితే ఈసారి కరోనా వైరస్ పండుగ ఆనందాన్ని దూరం చేసింది. సామాజిక దూరాన్ని పాటించే నిమిత్తం ఎవరి ఇళ్లలో వారు ఉండి ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఈద్ ముబారక్ చెప్పుకుంటున్నారు. మరి క్వారంటైన్‌లో ఉన్న వారి పరిస్థితి ఏంటని ఆలోచించిన సింగపూర్ వ్యాపారవేత్త దుష్యంత్ కుమార్ పండుగ పూట వారికి తోడుగా నిలవాలనుకున్నారు. దాదాపు 600 మంది వలస కూలీలకు బిర్యానీ తయారు చేయించి ప్యాకెట్లలో సర్ధి వారికి అందించారు. లాక్డౌన్ ప్రారంభైన రోజు నుంచి ప్రతి రోజు వెయ్యి మందికి భోజనం పెడుతూ తన మంచి మనసుని చాటుకున్నారు.

Next Story

RELATED STORIES