Top

భూకబ్జాపై సీఆర్‌డీఏ కమిషనర్‌కు లేఖ రాసిన వర్ల రామయ్య

భూకబ్జాపై సీఆర్‌డీఏ కమిషనర్‌కు లేఖ రాసిన వర్ల రామయ్య
X

ఏపీలో భూకబ్జా ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాజధాని గ్రామమైన మందడంలో 15 సెంట్ల పోరంబోకు భూమి అన్యాక్రాంతం అయినట్లు టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు లేఖ రాశారు. సచివాలయానికి అతి సమీపంలో ఉన్న ఆ భూమిని స్థానిక వైసీపీ ఎంపీ, అతని అనుచరులు ఆక్రమించి మట్టి తరలింపు కూడా చేపట్టారని లేఖలో విమర్శించారు. ఈ వ్యవహారం పోలీసులకు తెలిసినా.. అధికార పార్టీ నేతల హస్తం ఉండడంతో.. ఏమీ మాట్లాడడం లేదని వర్ల రామయ్య తెలిపారు. వెంటనే పోరంబోకు స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు.

Next Story

RELATED STORIES