వరంగల్ మృతదేహాల కేసు.. ఒక హత్య నుంచి తప్పించుకునేందుకే 9 హత్యలు!

వరంగల్ మృతదేహాల కేసు.. ఒక హత్య నుంచి తప్పించుకునేందుకే 9 హత్యలు!
X

వరంగల్‌ గొర్రెకుంట పరిధిలోని బావిలో బయటపడిన మృతదేహాలకు సంబంధించి ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక హత్య నుంచి తప్పించుకునేందుకే 9 హత్యలు చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. ఈ మేరకు నిందితుడు సంజయ్‌ కుమార్‌ యాదవ్‌ వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడు నెలల క్రితం... మక్సూద్‌ మరదల్ని నిడదవోలు ప్రాంతంలో రైలు నుంచి తోసేసి హత్య చేశాడు సంజయ్‌ కుమార్‌ యాదవ్‌. అప్పటనుంచి ఆమె కనిపించలేదు. దీంతో తన మరదలు గురించి.. పదేపదే సంజయ్‌ను ప్రశ్నించాడు మక్సూద్. ఈ విషయం మక్సూద్‌ పోలీసులకు చెబుతాడనే అనుమానంతో కుటుంబాన్ని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు సంజయ్‌.

మక్సూద్‌ కుమారుడి బర్త్‌డే సందర్భంగా.. కూల్‌డ్రింక్స్‌లో మత్తు మందు కలిపి ఇచ్చినట్లు పోలీసులు వాంగ్మూలం ఇచ్చాడు. ఆ తర్వాత స్ప్రహ లేకుండా ఉన్న వీరందిరిని.. గోనెసంచులలో వేసుకుని.. బావిలో పడేసినట్లు ఒప్పుకున్నాడు. ఇందుకోసం మరో ఇద్దరు స్నేహితుల సహకారం తీసుకున్నట్లు పోలీసులకు తెలిపాడు.

దీంతో పాటు సంజయ్‌కు.. మక్సూద్‌ కూతురితో సాన్నిహిత్యం ఉంది. అయితే ఆమె గత కొంతకాలంగా ఇతరులతోనూ అంతే సాన్నిహత్యంగా ఉండటంతో దీన్ని సహించలేకపోయాడు సంజయ్‌. అందుకే కుటుంబం మొత్తాన్ని హత్య చేశాడు. నిందితుడితో పాటు మృతుల కాల్‌ డేటాలను సమగ్రంగా విశ్లేషించిన పోలీసులు.. చివరికి సంజయ్‌ కుమార్‌ యాదవే‌ నిందితుడని తేల్చారు.

Next Story

RELATED STORIES