దటీజ్ అక్షయ్.. రూల్స్ కచ్చితంగా పాటిస్తూ..

దటీజ్ అక్షయ్.. రూల్స్ కచ్చితంగా పాటిస్తూ..
X

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, చిత్ర నిర్మాత ఆర్ బాల్కి, సోమవారం కమలిస్తాన్ స్టూడియోలో పోస్ట్ లాక్డౌన్ బాధ్యతలు అనే ప్రకటనకు సంబంధించి షూటింగ్ జరుపుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి షూటింగ్ కొనసాగిస్తున్నారు. ఈ ప్రకటన ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోసం రూపొందిస్తోందని, మాస్కులు ధరించడం, కనీస సిబ్బందితో పనిచేయడం వంటి అన్ని జాగ్రత్తలు మా యూనిట్ తీసుకుందని బాల్కి చెప్పారు. మనలో ప్రతి ఒక్కరు లాక్డౌన్ అనంతరం తీసుకోవలసిన బాధ్యతల గురించి రూపొందిస్తున్న ప్రకటన ఇది. ఇందులో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడని అన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూ షూటింగ్ చేయడం మొదట కొద్దిగా కష్టంగానే అనిపించినా కొద్ది నిమిషాల్లోనే దీనిని అలవాటు చేసుకున్నామని అన్నారు. బాల్కి పద్మాన్, మిషన్ మంగల్ వంటి చిత్రాలలో అక్షయ్‌తో కలిసి పని చేసిన దర్శకుడు. నిర్మాత అనిల్ నాయుడు, భద్రత పాటిస్తూ తక్కువ మంది వ్యక్తులతో షూట్ ఎలా చేయగలమో మాకు చూపించారు. కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని మార్చి నెల మధ్య నుండి సినిమాల షూటింగ్ నిలిచిపోయింది. జూన్ మొదటి వారం నుంచి కొన్ని ఇండస్ట్రీల్లో షూటింగ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.

Next Story

RELATED STORIES