మీడియా రంగంపై వేలాడుతున్న క‌రోనా క‌త్తి.. రూ.46కే మీడియా సంస్థ కొనుగోలు!

మీడియా రంగంపై వేలాడుతున్న క‌రోనా క‌త్తి.. రూ.46కే మీడియా సంస్థ కొనుగోలు!

అక్షరం సంక్షోభంలో చిక్కుకుంది. జనాలకు మార్గదర్శనం చేసే మీడియా రంగం ఇప్పుడు దిక్కులు చూస్తోంది. అనుకోకుండా విరుచుకుపడిన కరోనా మహమ్మారి నేపథ్యంలో వచ్చిన మార్పులకు తలవోంచి, పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు ఈ మహమ్మారి కారణంగా యావత్తు జగత్తూ చిగురుటాకులా వణికిపోతుంటే.. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మీడియా రంగం దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటుంది.

కరోనా కల్లోలం కారణంగా ప్రకటనలతో వచ్చే ఆదాయం పడిపోవడంతో మీడియా రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. కొన్ని మీడియా సంస్థలు మూసేసే పరిస్థితి కూడా వచ్చింది. జూన్ నుంచి తమ న్యూస్ ప్రొడక్షన్, సబ్ ఎడిటింగ్ కార్యకలాపాలు మూసివేయనున్నట్టు ఆస్ట్రేలియా న్యూస్ ఏజెన్సీ ‘ఆస్ట్రేలియన్ అసోసియేటెడ్ ప్రెస్’ ప్రకటించాయి. ఇక బౌర్ మీడియా కూడా తమ న్యూజిలాండ్ కార్యకలాపాలను నిలిపివేయనున్నట్టు పేర్కొంది.

తాజాగా న్యూజిలాండ్ మీడియా సంస్థ ‘స్టఫ్’ యాజమాన్యం తమ సీఈవోకి కేవలం 46రూపాలయకే మీడియా సంస్థను కట్టబెట్టేసింది. ఈ విషయాన్ని సీఈవో సినాడ్ బౌచర్ వెల్లడించారు. ఆస్ట్రేలియాకి చెందిన స్టఫ్ మాతృసంస్థ నైన్ ఎంటర్‌టైన్మెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్‌ నుంచి.. 1 న్యూజిలాండ్ డాలర్‌కే స్థానిక యాజమాన్య హక్కులను కొనుగోలు చేసినట్టు సీఈవో సినాడ్ బౌచర్ ప్రకటించారు. ‘‘స్థానిక జర్నలిజానికి భవిష్యత్తు ఉన్నదనేందుకు ఈ నిర్ణయమే నిదర్శనం.. కంపెనీ సిబ్బంది షేర్‌హోల్డర్లుగా వ్యాపారంలో ప్రత్యక్ష వాటా తీసుకోనున్నారు''. అని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రముఖ వెబ్‌సైట్లు, వార్తాపత్రికలకు నేతృత్వం వహిస్తున్న స్టఫ్.. న్యూజిలాండ్‌లోని అన్ని మీడియా సంస్థలకంటే ఎక్కువగా తమకు 900 మంది జర్నలిస్టులు ఉన్నట్టు పేర్కొంది. మీడియా రంగం కరోనా కోరాల్లో చిక్కుకుని ఎంతలా విల‌విల‌లాడుతుందో ఈ ఘటనే నిదర్శనం.

Tags

Read MoreRead Less
Next Story