అంతర్జాతీయం

రష్యాలో 24 గంటల్లో 174 మంది..

రష్యాలో 24 గంటల్లో 174 మంది..
X

రష్యాలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రోజు రోజుకి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 174 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో ఇన్ని మరణాలు ఈ రెండు నెలల కాలంలో సంభవించలేదు. మరోవైపు 24 గంటల్లో కొత్త కేసులు 8,915 మంది కాగా దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 362,342కు పెరిగింది. ఇప్పటి వరకు నమోదైన కరోనా మృతులు 3,807. అమెరికా, బ్రెజిల్ తరువాత రష్యాలోనే అధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశ రాజధాని మాస్కోలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అందుకే మాస్కోలో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తోంది ప్రభుత్వ యంత్రాంగం.

Next Story

RELATED STORIES