రెండు నెలల తర్వాత ఎగిరిన విమానాలు.. ప్రయాణికుల క్వారంటైన్‌పై గందరగోళం

రెండు నెలల తర్వాత ఎగిరిన విమానాలు.. ప్రయాణికుల క్వారంటైన్‌పై గందరగోళం

రెండు నెలల తర్వాత విమానాలు ఎగిరాయి. ప్రయాణికులను తీసుకెళ్తున్నాయి. 7 కేటగిరీల్లో విమాన సర్వీసు ఛార్జీలు అమల్లో ఉన్నాయి. అయితే.. ప్రయాణికుల క్వారంటైన్‌పై గందరగోళం నెలకొంది. వివిధ రాష్ట్రాలు వేర్వేరుగా మార్గదర్శకాలు ప్రకటించాయి. కర్నాటక, తమిళనాడు, కేరళ, బీహార్‌ సహా పలు రాష్ట్రాలు సొంతంగా క్వారంటైన్ నిబంధనలు వెల్లడించాయి. ప్రయాణికులు తప్పనిసరిగా ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టంచేశాయి. హోం క్వారంటైన్‌లో ఉండాలని మరికొన్ని రాష్ట్రాలు మార్గదర్శకాల్లో తెలిపాయి.

విమాన ప్రయాణికులు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని కేరళ, పంజాబ్‌ సూచించాయి. తమ రాష్ట్రానికి వచ్చే వారు.. సొంత ఖర్చులతో క్వారంటైన్‌కు వెళ్లాలని, రెండు వారాలు ఉండాలని బీహార్‌ స్పష్టంచేసింది. మరోవైపు.. ప్రయాణికులు ఏ రాష్ట్రానికి వెళ్తున్నారో.. అక్కడి మార్గదర్శకాలు, ప్రోటోకాల్‌ను ముందే తెలుసుకోవాలని, చదువుకుని అవగాహన చేసుకోవాలని విమానయాన సంస్థలు కోరాయి.

Tags

Read MoreRead Less
Next Story