పాము కాటుతో భార్య మృతి.. భర్త అరెస్ట్‌

పాము కాటుతో భార్య మృతి.. భర్త అరెస్ట్‌
X

ఆస్తి మీద కన్నేసిన భర్త.. భార్యను అతి కిరాతకంగా పాము కాటుతో చంపాడు.. ఈ ఘటన ఆలశ్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది.. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళ కొల్లం ప్రాంతానికి చెందిన సూరజ్ అనే వ్యక్తి ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు.. అతనికి రెండేళ్ల క్రితం ఉత్తర అనే మహిళతో వివాహం జరిగింది. వీరి కాపురం అనోన్యంగా సాగుతోంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. అయితే భార్య పేరున ఉన్న ఆస్తి మీద కన్నేసిన సూరజ్ కు‌ ఎలాగైనా ఈ ఆస్తి కాజెయ్యాలన్న దుర్బుద్ధి పుట్టింది. ఆమెను అంతమొందిస్తే ఆస్తి తనదవుతుందన్న పేరాశతో భార్యను చంపాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే హత్య చేస్తే పోలీసులకు అనుమానం వస్తుందన్న కారణంతో.. ఇందుకోసం ఓ పథకం వేశాడు.. అందులో భాగంగా పాములు పట్టడంలో నేర్పరి అయిన సురేశ్‌ సాయం తీసుకున్నాడు. అతని సాయంతో ఫిబ్రవరిలో ఒకసారి ఉత్తరను పాము కాటు వేసేలా ప్లాన్ చేశాడు.

ఆ సమయంలో ఉత్తరకు చికిత్స అందించడంతో కోలుకుంది. మొదటి ప్రయత్నం విఫలం కావడంతో మే నెలలో మళ్ళీ ఇదే ప్లాన్ వేశాడు.. మే 6వ తేదీ రాత్రి ఉత్తర బెడ్‌ రూమ్‌లో సురేశ్‌ వద్ద నుంచి తెచ్చిన పామును వదిలాడు. ఉదయం లేచి చూసేసరికి ఆమె మరణించారు. ఆ రోజు రాత్రి ఇంట్లోనే ఉన్న సురేశ్‌.. తనకేం తెలియదనట్టు ఆమెను ఆస్పత్రికి తరలించాడు. అయితే ఆమె అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే ఉత్తరను రెండుసార్లు పాము కాటు వేయడంపై అనుమానం వ్యక్తం చేసిన ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులకు అసలు కుట్ర బయటపడింది. భార్య ఆస్తి కోసమే సూరజ్‌ పథకం ప్రకారం ఈ హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అరెస్ట్‌ చేసి కోర్టు సూచన మేరకు రిమాండ్‌కు తరలించారు.

Next Story

RELATED STORIES