టీవీ5 ఎఫెక్ట్‌.. నిండు గర్భిణీపై కథనంతో స్పందించిన అధికారులు

టీవీ5 ఎఫెక్ట్‌.. నిండు గర్భిణీపై కథనంతో స్పందించిన అధికారులు

కర్నూలు జిల్లా ఆలూరులో నిండు గర్భిణీపై మానవత్వం చూపని వైద్యాధికారులంటూ టీవీ5 ప్రసారం చేసిన కథనంతో.. అధికారులు స్పందించారు. గర్భిణీ గౌరమ్మను ఆదోని ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్‌లో... ఆగమేఘాల మీద... ఆమెను ఆదోని ఆసుపత్రికి తరించి వైద్య చికిత్స అందించారు.

ఇటీవలే గోవా నుంచి సొంత ఊరు బిల్లేహాల్‌కు తిరిగి వచ్చింది గర్బిణీ గౌరమ్మ. లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా... ఆమెను గత పది రోజులుగా హాలహర్వి క్వారంటైన్‌లో ఉంచారు అధికారులు. అయితే ఆమెకు సోమవారం నొప్పులు రావడం ప్రారంభమయ్యాయి. కానీ క్వారంటైన్‌లో ఉన్న అధికారులు ఇవేవి పట్టించుకోలేదు. తీవ్ర నొప్పులతో ఆమె బాధపడుతున్నా.. కనీసం అంబులెన్స్‌లో ఆసుపత్రికి కూడా పంపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అధికారులు.

చివరికి బంధువులకు ఫోన్‌ చేయడంతో.. వారు ఆమెను... మోటార్‌ బైక్‌లో ఆలూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రిలోనూ ఆమె కష్టాలు తప్పలేదు. క్వారంటైన్‌ నుంచి వచ్చినందుకు ప్రసవం చేసేందుకు ఆలూరు వైద్యులు నిరాకరించారు. దీనిపై టీవీ5లో కథనం ప్రసారమైంది. వెంటనే స్పందించిన వైద్యాధికారులు... అప్పటికప్పుడు గౌరమ్మను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. టీవీ5కి ధన్యవాదాలు చెప్పారు బంధువులు.

Tags

Read MoreRead Less
Next Story