కరోనాని పంచిన 'పాట్‌లక్' విందు.. లక్షా 30వేల మంది హాజరు

కరోనాని పంచిన పాట్‌లక్ విందు.. లక్షా 30వేల మంది హాజరు

గత ఏడాది డిసెంబర్‌లోనే కరోనా వైరస్ కనిపించింది చైనాలో. అయినా ఏమాత్రం కట్టడి నియంత్రణ చర్యలు చేపట్టకపోగా ప్రపంచ రికార్డు స్థాపనే ధ్యేయంగా 'పాట్‌లక్' విందు నిర్వహించారు. జనవరి 19న వూహాన్‌లోని ది బైబుటింగ్ అనే కమ్యూనిటీ సెంటర్లో అతి పెద్ద పాట్‌లక్ విందు నిర్వహించారు. ఈ విందుకు లక్షా 30 వేల మంది హాజరయ్యారు. అప్పటికే వైరస్ వూహాన్ నగరంలో వేళ్లూనుకుంది. అయినా అధికారులు కార్యక్రమాన్ని రద్దు చేయకుండా ప్రపంచ రికార్డు స్థాపించాలని విందు కొనసాగించారు.

విందు ముగిసిన అనంతరం కరోనా వైరస్ వేగంగా విజృంభించింది. విందు నిర్వహించిన ప్రదేశం చుట్టుపక్కల ఉన్న 33 భవనాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి వీటిని ఫీవర్ బిల్డింగ్స్ అని పిలుస్తున్నారు. వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని మొదటే చుట్టుపక్కల వారు విందు నిర్వహించవద్దని చెప్పారు. అయినప్పటికీ జిల్లా అధికారులు విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. జనవరి 23 నాటికి పరిస్థితి చేయి దాటి పోతుందని వూహాన్ అంటువ్యాధుల నిపుణులకు అర్థమైపోయింది. దాంతో వెంటనే వూహాన్ పట్టణంలో లాక్డౌన్ విధించారు. కానీ అప్పటికే వూహాన్ నగరం నుంచి లక్షల మంది దేశ సరిహద్దులు దాటేశారు.

చైనీయులు తాము తినే స్పూన్లతోనే వడ్డించుకుంటారు. దీంతో వైరస్ వ్యాప్తి సులభమవుతుందని భావించిన అధికారులు విందులో పబ్లిక్ స్పూన్లను ఉంచాలనే నిబంధనలు జారీ చేశారు. చైనాలోని సంపన్న కుటుంబాల వారే వడ్డించేందుకు ప్రత్యేక సామాగ్రిని ఉపయోగిస్తారు. ప్రపంచ రికార్డు సాధించడం కోసం విందు నిర్వహించారు. ఆఖరికి ప్రపంచం మొత్తాన్ని కోవిడ్ బారిన పడేశారు. సార్స్ లాగే కరోనాను కూడా కట్టడి చేయగలమనుకుంది చైనా. కానీ పరిస్థితి రోజు రోజుకి చేయి దాటి పోతోంది. ఇంతవరకు వైరస్‌ని కట్టడి చేసే వ్యాక్సిన్ కూడా రాలేదు.

Tags

Read MoreRead Less
Next Story