తరలిపోతున్న కంపెనీలను కాపాడుకోవడానికి చైనా ఈ వివాదం రేపింది: కేంద్రమంత్రి

తరలిపోతున్న కంపెనీలను కాపాడుకోవడానికి చైనా ఈ వివాదం రేపింది: కేంద్రమంత్రి
X

చైనా, భారత్ మధ్య వివాదంగా మారిన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ని కచ్చితంగా ఎవరూ గుర్తించలేదని.. అందువల్లే.. ఇరుదేశాల మధ్య వివాదాలకు ఇది కేంద్రం అవుతోందని కేంద్ర మంత్రి వీకే సింగ్ అన్నారు. కరోనాను చైనా సృష్టించిందని యావత్ ప్రపంచం కోడై కూస్తుందని.. దీంతో.. అందరి దృష్టి మరల్చడానికి చైనా ఎల్‌ఐసిని ఒక అవకాశంగా మార్చుకుంటుందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే అనేక కంపెనీలు చైనా నుంచి తరలి వెలుతున్నాయని.. చాలా కంపెనీలు కూడా చైనాను ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఆ కంపెనీలను కాపడుకోవాలి అంటే అందరి దృష్టి కరోనా నుంచి డైవర్ట్ చేయడానికి చైనా అడుతున్న నాటకంలో భాగంగా ఎల్ఏసీని తెరపైకి తెస్తుందని ఆయన అన్నారు. చైనా ఇలాంటి కుతంత్రాలుకు తరచూ వ్యూహాలు రచిస్తుందని.. కానీ, వాటికి బయపడాల్సిన అవసరం లేదని అన్నారు.

Next Story

RELATED STORIES