ఐఆర్ఎస్ అధికారి ఆత్మహత్య

ఐఆర్ఎస్ అధికారి ఆత్మహత్య
X

ఐఆర్ఎస్ అధికారి కేశవ్ సక్సేనా ఢిల్లీ చాణక్యపురిలోని తన నివాసంలో ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న అతడిని దించి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అధికారి ప్రాణాలు కోల్పోయారు. 57 ఏళ్ల సక్సేనా 1988 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ప్రిన్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆయన గదిలో దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా వృత్తి పరమైన మానసిక వత్తిళ్లు ఎమైనా ఎదుర్కుంటున్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

RELATED STORIES