గూగుల్ ఉద్యోగులకు 1000 డాలర్లు

గూగుల్ ఉద్యోగులకు 1000 డాలర్లు

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న గూగుల్ ఉద్యోగులకు కంపెనీ 1000 డాలర్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇంటి నుంచి పని చేసేందుకు వీలుగా వారికి ఒక ల్యాప్‌టాప్, ఇతర హార్డ్‌వేర్ పరికరాలు కొనేందుకు వీలుగా ఈ మొత్తాన్ని అందించనుందని సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. మరి కొంత కాలం ఇంటి నుంచే పని చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను ఉద్యోగులకు అవసరమైన సదుపాయాలు సమకూర్చాలనుకుంటున్నాం అని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో కంపెనీ తమ కోసం ఉందన్న భరోసా ఉద్యోగులకు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జులై 6 నాటికి తమ కార్యాలయాలను మరింత విస్తరింపజేయనున్నామని అన్నారు. ఆయా నగరాల్లో వైరస్ తీవ్రతను అంచనా వేసి కంపెనీలు తెరుస్తామని చెప్పారు. ఉద్యోగులు కోవిడ్ నిబంధనలు అనుసరించి కార్యాలయాలకు హాజరయ్యేలా చూస్తామని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story