ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ

ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అత్యవసర పనుల కోసం కంపెనీలోకి తమను అనుమతించాలంటూ కంపెనీ ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్ వేశారు. రోజువారీ కార్యకలాపాల కోసం కంపెనీలోకి వెళ్ల డానికి సుప్రీంకోర్టు 30 మందికి అనుమతి ఇచ్చిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెప్పారు. ఈ పిటిషన్‌పై స్పందించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది, కంపెనీలోకి వెళ్లే 30 మంది పేర్లు తమకు అందలేదని చెప్పారు. పేర్లు రానందువల్లే నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ వాదనను కంపెనీ తోసిపుచ్చింది. తాము ఇప్పటికే పేర్ల జాబితాను అధికారులకు ఇచ్చామని వివరణ ఇచ్చారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు, వివరాలను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారంకి వాయిదా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com