దేశ ఆర్థిక వ్యవస్థపై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

దేశ ఆర్థిక వ్యవస్థ చక్కదిద్దాలంటే 50 లక్షల కోట్లు అవసరమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాలేదని.. నిరుద్యోగ రేటు బాగా పెరిగిందని అన్నారు. లాక్ డౌన్ కారణంగా వ్యాపారా లావాదేవీలు స్తంభించిపోయాయని అన్నారు. వీటన్నింటినీ అధిగమించాలంటే.. మార్కెట్ లో నగదు అందుబాటులో ఉండాలని అన్నారు. సుమారు 50 లక్షల కోట్లు ఉంటే ఈ పరిస్తితుల నుంచి బయటపడొచ్చని అన్నారు. ఇప్పటికే కేంద్రం 20 లక్షల కోట్లు ప్యాకేజీని ప్రకటించిందని.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మొత్తం మరో 20 లక్షల కోట్లు, పబ్లిక్ - ప్రైవేట్ బాగస్వామ్యంతో మరో పదిలక్షల కోట్లు అందుబాటులోకి వస్తే.. ఆర్థిక వ్యవస్థను ఒక గాడిలో పెట్టవచ్చని అన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను తిరిగి పట్టాలెక్కించడానికి బ్యాంకులు రంగంలోకి దిగాయని.. కేంద్రం దానికి అనుగుణంగా అడుగులు వేస్తుందని తెలిపారు. జీడీపీని 2-3 శాతం వృద్ధికి తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నామని.. కానీ.. నెగెటివ్ జీడీపీయే పెద్ద సమస్యగా మరిందని అన్నారు. మార్కెట్ లో నగదు అందుబాటులో ఉంటే కానీ.. ఈ సమస్యలను అధిగమించలేమని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com