ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్‌బిఐ

దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయించింది. అన్ని టర్మ్ ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను బ్యాంక్ 0.40% తగ్గించింది. కొత్త రేట్లు మే 27 నుండి అమల్లోకి రానున్నాయి. 2 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ బల్క్ ఎఫ్‌డిలపై ఎస్‌బిఐ 50 బిపిఎస్‌ల వరకు తగ్గించింది. ఈ క్యాటగిరీ కస్టమర్లకు బ్యాంక్ గరిష్టంగా మూడు శాతం వడ్డీని చెల్లిస్తోంది. అంతకుముందు, ఎస్బిఐ ఈ నెలలో ఎఫ్డిలపై వడ్డీ రేట్లను తగ్గించింది. ఎస్‌బిఐ మే 12 నుండే ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డి) పై వడ్డీని 0.20 శాతం తగ్గించింది. ఇక ఎస్బిఐ పొదుపు ఖాతాపై కూడా వడ్డీని తగ్గించింది. దీని కింద, డిపాజిట్లపై 2.75 శాతం వార్షిక వడ్డీ చెల్లించబడుతోంది, ఇది అంతకుముందు 3 శాతంగా ఉంది.
ఎఫ్‌డిపై ఎస్‌బిఐ తాజా వడ్డీ వివరాలు ఇలా ఉన్నాయి
7 రోజుల నుండి 45 రోజుల వరకు - 2.9% , 46 రోజుల నుండి 179 రోజుల వరకు - 3.9% , 180 రోజుల నుండి 210 రోజుల వరకు - 4.4%, 211 రోజుల నుండి 1 సంవత్సరం కన్నా తక్కువ - 4.4%, 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కన్నా తక్కువ - 5.1%, 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కన్నా తక్కువ - 5.1%, 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కన్నా తక్కువ - 5.3%, 5 సంవత్సరాలు మరియు 10 సంవత్సరాల వరకు - 5.4% గా నిర్ణయించారు.
సీనియర్ సిటిజన్లకు మే 27 నుంచి ఎస్‌బిఐ తాజా ఎఫ్‌డి వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి
ఇక సీనియర్ సిటిజన్లకు అన్ని టేనర్‌లలో అదనంగా 50 బిపిఎస్ వడ్డీ రేటు వస్తోంది. అయితే తాజాగా సవరించిన వడ్డీ రేట్లలో వారు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వ్యవధిలో ఎఫ్‌డిలపై 3.4% నుండి 6.2% వరకు పొందవచ్చు. ఇందులో 7 రోజుల నుండి 45 రోజుల వరకు - 3.4%, 46 రోజుల నుండి 179 రోజుల వరకు - 4.4% , 180 రోజుల నుండి 210 రోజుల వరకు - 4.9%, 211 రోజుల నుండి 1 సంవత్సరం కన్నా తక్కువ - 4.9%, 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కన్నా తక్కువ - 5.6%, 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కన్నా తక్కువ -5.6%, 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కన్నా తక్కువ - 5.8%, 5 సంవత్సరాలు మరియు 10 సంవత్సరాల వరకు - 6.2%గా నిర్ణయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com