దక్షిణ కొరియా : 49 రోజుల్లో అత్యధిక రోజువారీ కరోనా కేసులు

X
By - TV5 Telugu |27 May 2020 8:05 PM IST
బుధవారం దక్షిణ కొరియా అత్యధిక కొత్త కరోనావైరస్ కేసులను నివేదించింది, 49 రోజుల్లో ఇవే అత్యధికంగా ఆ దేశ ఆరోగ్య అధికారులు నివేదించారు. గత 24 గంటల్లో 40 కొత్త పాజిటివ్ కేసులొచ్చాయి.. దాంతో దేశ మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,265 కు చేరుకుంది. కొరియా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం గత 24 గంటల్లో కొత్త కేసులలో 37 స్థానికంగా వచ్చాయని.. అవి కూడా ఎక్కువగా సియోల్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఉన్నాయని, ఇక మిగిలిన మూడు విదేశాల నుండి వచ్చిన వారికి పాజిటివ్ వచ్చిందని పేర్కొంది. దేశంలో కరోనా ద్వారా మరణించిన వారి సంఖ్య 269 అలాగే ఉంది, రికవరీ సంఖ్య 20 పెరిగి మొత్తం 10,295 కు చేరుకుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com