Top

రేపు టీటీడీ పాలకమండలి సమావేశం

రేపు టీటీడీ పాలకమండలి సమావేశం
X

గురువారం టీటీడీ పాలకమండలి కీలక సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాలకమండలి సమావేశం జరగనుంది. తిరుపతి నుంచి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు కరుణాకర్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ప్రత్యక్షంగా సమావేశంలో పాల్గొంటారు.. ఇక మిగిలిన సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్నారు.

Next Story

RELATED STORIES