తాజా వార్తలు

వివాహేతర సంబంధం .. భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన భర్త

వివాహేతర సంబంధం .. భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన భర్త
X

వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు చుక్కలు చూపించిందో భార్య. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చితక బాదింది. భర్తతో పాటు అతనితో సంబంధం పెట్టుకున్న మహిళకు కూడా దేహశుద్ధి చేసింది. వరంగల్ బీట్‌ బజార్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వరంగల్‌కు చెందిన తులసి, శ్రీనివాస్‌లకు పదేళ్ల క్రితం పెళ్లైంది. వాళ్లిద్దరూ పోతన నగర్‌లో నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్‌ ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. రెండు నెలలుగా ఇంటికి రాకపోవడంతో తులసి కి అనుమానం వచ్చింది. ఆరా తీస్తే అసలు బాగోతం బయటపడింది. వేరే మహిళతో సంబంధం పెట్టుకొని బీట్ బజార్‌ లో కాపురం పెట్టినట్లు తెలుసుకుంది. అంతే, బంధువులతో కలసి అతని ఇంటికి వెళ్లింది. శ్రీనివాస్‌తో పాటు అతనితో సంబంధం పెట్టుకున్న అమ్మాయిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చితకబాదింది. అనంతరం వారిని స్థానికి ఇంతెజార్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.

Next Story

RELATED STORIES