తొలిసారిగా ఏపీ సీఎస్ హైకోర్టుకు హాజరై వివరణ..

తొలిసారిగా ఏపీ సీఎస్ హైకోర్టుకు హాజరై వివరణ..

కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టుకు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని. ఆమెతో పాటు.. పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌ కూడా కోర్టుకు హాజరయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసిన అంశంపై ఉన్నతాధికారులు హైకోర్టుకు హాజరవ్వాల్సి వచ్చింది. తొలిసారిగా ఏపీ సీఎస్ కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. తమ ఆదేశాలు బేఖాతరు చేశారని భావించిన న్యాయస్థానం… కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయడంతో ముగ్గురు ఉన్నతాధికారులు హైకోర్టు ముందు హాజరయ్యారు.

గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి వైసీపీ పార్టీకి చెందిన రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేశారంటూ పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థాయం విచారణ చేపట్టింది. రంగులను తొలగించాలని తీర్పు ఇచ్చింది. అయితే కోర్టు తీర్పుకు భిన్నంగా 620 జీవో తీసుకొచ్చి గతంలో రంగులతో పాటు మట్టి రంగును కలిపి వేస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం. దీంతో హైకోర్టు దీనిపైనా విచారణ చేపట్టింది. కోర్టు ధిక్కారణగా భావించిన హైకోర్టు... ఉన్నతాధికారులను తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో వివరణ ఇచ్చేందుకు సీఎస్ నీలం సహానితో పాటు ద్వివేది, గిరిజాశంకర్‌ కోర్టుకు వచ్చారు. తదుపరి విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేసింది

అటు జగన్‌ సర్కారు మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వద్దని హైకోర్టు రెండుసార్లు చెప్పినా సరే...గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు పూయడంపై వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకుంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు తలుపు తట్టింది. గ్రామ సచివాలయాలకు రాజకీయ పార్టీలకు చెందిన రంగులను పులమొద్దని గతంలోనే హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించి ప్రభుత్వానికి చుక్కెదురైంది. హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ... ఏదైనా అక్కడే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై హైకోర్టు ఈనెల 22న స్పష్టమైన తీర్పు చెప్పింది. నీలం, తెలుపు, ఆకుపచ్చకు తోడుగా ఎర్రమట్టి రంగును చేర్చుతూ జారీ చేసిన జీవో నంబర్‌ 623ను రద్దుచేసింది. అయినా.. కూడా వెనక్కి తగ్గిన వైసీపీ సర్కారు... ఇప్పుడు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Tags

Read MoreRead Less
Next Story