మమత ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూన్ 30 వరకూ విద్యాసంస్థలు బంద్

మమత ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూన్ 30 వరకూ విద్యాసంస్థలు బంద్

కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయినా.. కరోనా విజృంభణ కొనసాగుతోంది. దీంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. అయితే, కరోనా కట్టడిలో భాగంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జూన్ 30 వరకూ వాటిని తెరవకూడదని నిర్ణయం తీసుకుంది. ఇటీవల బెంగాల్ ను అంఫాన్ తుఫాన్ అతలాకుతలం చేసింది. దీంతో చాలా స్కూల్స్ ధ్వంసమయ్యాయి. వీటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. దీంతో మమత ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story