హాంకాంగ్‌పై పట్టు బిగించేందుకు కొత్త బిల్లుకు ఆమోదం తెలిపిన చైనా పార్లమెంట్‌

హాంకాంగ్‌పై పట్టు బిగించేందుకు కొత్త బిల్లుకు ఆమోదం తెలిపిన చైనా పార్లమెంట్‌

హంకాంగ్ పై మరింత పట్టు సాధించేందుకు.. చైనా అడుగులు వేస్తుంది. దీనికి తగ్గట్టుగా హాంకాంగ్ పై కొత్త భద్రతా బిల్లుకు చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ప్రతీ ఏడాది జరిగే చైనా వార్షిక రాజకీయ సమావేశాలు.. కరోనా వైరస్ కారణంగా కాస్తా ఆలస్యంగా జరిగాయి. ఈ సమావేశాల చివరి రోజైన గురువారం ఈ బిల్లుతో సహా అనేక బిల్లులకు చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే.. హాంకాంగ్ లో చైనా అధికారాన్ని తక్కవ చేయడాన్ని నేరంగా పరిగణించే ఈ కొత్త బిల్లు చట్టరూపం దాల్చుతుందా? లేదా చూడాలి. చైనా పార్లమెంట్ లో ఆమోదం పొందిన ఈ బిల్లు స్టాండింగ్ కమిటీకి వెళ్తుంది.. అక్కడ ఆమోదం పొందితే.. ఆగష్టు నాటికి ఇది చట్టరూపం దాల్చుతుంది. అయితే ఇది ఎంత వరకు సఫలీకృతమవుతుందో ఉత్కంఠగా మారింది. ఇది చట్టంగా మారితే.. చైనా భద్రతా సంస్థలు.. హాంకాంగ్ లో తమ కార్యలయాలను ప్రారంభించి కార్యకలాపాలు నిర్వహింస్తారు. దీంతో హాంకాంగ్ పెరిగిపోతున్న ఉగ్రవాదాన్ని అరికడతామని చైనా చెబుదోంది. అటు, ఇది చట్టంగా మారితే డ్రాగన్ అధికారాన్ని ప్రశ్నించడానికి హక్కులు ఉండవని హాంకాంగ్ తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తమ ఆధీనంలో ఉన్న హాంకాంగ్ ను 1997 జూలై1 బ్రిటీష్.. చైనాకు వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి చైనాలో భాగంగా ఉంటూనే.. స్వంతంత్రంగా వ్యవహరిస్తుంది. అయితే, ఈ బిల్లుతో హాంకాంగ్ తమ స్వంతంత్రను కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story