హాంకాంగ్ జాతీయ భద్రత చట్టానికి చైనా పార్లమెంట్ ఆమోదం

హాంకాంగ్ జాతీయ భద్రత చట్టానికి చైనా పార్లమెంట్ ఆమోదం

హాంకాంగ్‌పై కఠినమైన ఆంక్షలు విధించే జాతీయ భద్రతా చట్టానికి చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. సెమీ స్వయంప్రతిపత్తి కలిగిన హాంకాంగ్‌ భూభాగాన్ని బీజింగ్ నియంత్రణలోకి తీసుకురావాలనే లక్ష్యంతో స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసింది చైనా.. అయితే కమిటీ ఇచ్చిన డ్రాఫ్ట్ బిల్లుకు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ లో గురువారం ఓటింగ్ జరిగింది. ఈ బిల్లుకు అనుకూలంగా 2,878 ఓట్లు రాగా.. 1ఓటు వ్యతిరేకంగా వచ్చింది.

దీంతో సభలో అత్యధిక మెజారిటీ ఓట్లతో ఈ బిల్లు ఆమోదం పొందినట్టయింది. హాంకాంగ్‌లో వేర్పాటువాదుల అణచివేత, ఉగ్రవాదం, విదేశీ జోక్యాన్ని నివారించే లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టు చైనా చెబుతోంది. అయితే చైనా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై గతవారం రోజులుగా హాంకాంగ్‌లో పెద్ద ఎత్తున నిరసనలు రావడమే కాకుండా అమెరికా సహా పలు దేశాల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతున్నాయి.. చైనా మాత్రం ఇవేవి లెక్కచేయకుండా ఈ బిల్లును ఆమోదించింది.

Tags

Read MoreRead Less
Next Story