కొత్త కొలువులు వస్తున్నాయ్.. క్లుమియో కంపెనీలో..

కొత్త కొలువులు వస్తున్నాయ్.. క్లుమియో కంపెనీలో..

అమెరికాకు చెందిని ఓ స్టార్టప్ కంపెనీ ఇండియాలో ఏర్పాటు చేయడానికి సన్నహాలు చేస్తోంది. క్లుమియో కంపెనీ బెంగళూరులో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీలో సాప్ట్‌వేర్-యాస్-ఏ-సర్వీస్ (ఎస్ఏఏఎస్) ఆధారిత డేటా ప్రొటెక్షన్ సొల్యూషన్స్ అందిస్తామని కంపెనీ తెలిపింది. ఇండియాలో ఇప్పటికే ఈ కంపెనీలో 34 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను పెంచుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇండియాలో చాలా మంది టెక్నాలజీ నైపుణ్యం కలిగిన వారు ఉన్నారని క్లుమియో జీఎం అండ్ ఇంజనీరింగ్ వీపీ సందీప్‌సోనీ అన్నారు. సాప్ట్‌వేర్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్,కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాల్లో కొత్త నియామకాలు చేపట్టనున్నట్లు కంపెనీ యాజమాన్యం వివరించింది.

Tags

Read MoreRead Less
Next Story