శానిటైజర్‌ ఎక్కువగా వాడేస్తున్నారా..

శానిటైజర్‌ ఎక్కువగా వాడేస్తున్నారా..

అతి శుభ్రత కూడా ప్రమాదమే.. అప్పుడు ఏదొచ్చినా తట్టుకోలేవు అని స్నేహితులు అంటుంటే ఏమో అనుకున్నా కానీ అది నిజమే అని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. కరోనా వచ్చి శుభ్రతను మరింత పెంచింది. శానిటైజర్ వాడకం ఎక్కువైంది. ఇలా అధిక మోతాదులో శానిటైజర్ వాడితే మన అరచేతుల్లోని మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. మంచి బ్యాక్టీరియా మన చర్మాన్ని, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఆ బ్యాక్టీరియా మన బాడీలోకి వెళ్లకపోతే త్వరగా రోగాల బారిన పడతారని చెబుతున్నారు. ఇక చేతుల్లో ఉండే చెడు బ్యాక్టీరియాకి మంచి ఫుడ్డు అందించినట్టే.. శానిటైజర్‌తో బలంగా తయారవుతుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకుంటుంది. అందుకే అన్ని వేళలా శానిటైజర్ వాడకపోవడమే ఉత్తమం అంటున్నారు.

ఇంట్లోనే ఉంటే శానిటైజర్ వాడకుండా సబ్బుతో చేతులు శుభ్రపరుచుకోమంటున్నారు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పరిశోధకులు. చేతులు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు ఇంకా అపరిశుభ్రతను సృష్టిస్తాయి. క్రిముల్ని కూడా చంపలేదు. ఇక తుమ్మినా, దగ్గినా శానిటైజర్ వాడకం ఉపయోగం లేదు. గాలిలో కలిసిపోయిన వైరస్‌ను శానిటైజర్ చంపలేదు. ఇక మరో అతి ముఖ్య విషయం శానిటైజర్‌ను పిల్లలకు దూరంగా ఉంచాలి. వారు లోపలికి తీసుకున్నట్లైతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని యూఎస్ పాయిజన్ కంట్రోల్ సెంటర్ హెచ్చరిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story