Top

డాక్టర్ సుధాకర్‌కు అందిస్తున్న వైద్యంపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లి

డాక్టర్ సుధాకర్‌కు అందిస్తున్న వైద్యంపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లి
X

12 రోజులుగా విశాఖలోని మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న డాక్టర్‌ సుధాకర్‌ను ఆయన బంధువులు కలిశారు. ఆస్పత్రిలో తనకు అందుతున్న వైద్యంపై సుధాకర్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. లోపాలపై నాలుగు పేజీల లేఖ రాశారు సుధాకర్‌. ఆ లేఖను ఆయన బంధువులు హైకోర్టుకు అందజేయనున్నారు. సుధాకర్‌కు జరుగుతున్న వైద్యంపై తమకు అనుమానాలు ఉన్నట్లు ఆయన బంధువులు చెబుతున్నారు. తన కుమారుడిని ఉన్న రూమ్‌ అపరిశుభ్రంగా ఉందన్నారు సుధాకర్‌ తల్లి. 12 రోజులుగా చికిత్స చేస్తున్నా.. ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES