తాతా మళ్లీ ఒకసారి వచ్చిపోవా.. ఎన్టీఆర్ భావోద్వేగపు ట్వీట్

తాతా మళ్లీ ఒకసారి వచ్చిపోవా.. ఎన్టీఆర్ భావోద్వేగపు ట్వీట్
X

తాత నుంచి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న మనవడు జూనియర్ ఎన్టీఆర్ తాతను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. గురువారం ఎన్టీఆర్ 98వ జయంతి కావడంతో తాతకు నివాళులర్పించిన జూనియర్.. ట్విట్టర్ ద్వారా తన ఫీలింగ్స్‌ను షేర్ చేసుకున్నాడు. తనలోని కవి హృదయాన్ని బయటకు తీసుకువచ్చిన ఎన్టీఆర్ తాత కోసం ఓ నాలుగు వాక్యాలు రాశారు. మీ పాదం మోపక ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను.. మీరు లేని లోటు తీరనిది అంటూ తాతపై తనకున్న ప్రేమను వ్యక్తం చేశాడు.

Next Story

RELATED STORIES