అదరహో అనిపిస్తున్న నారా లోకేష్ న్యూలుక్

అదరహో అనిపిస్తున్న నారా లోకేష్ న్యూలుక్

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలియాలని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు సరిగ్గా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. నిన్నమొన్నటివరకు ఎంతో బొద్దుగా కనిపించిన చినబాబు.. ఒక్కసారిగా కొత్తలుక్‌లో కనిపించిన అందర్నీ ఆశ్చర్యపరిచారు. టీడీపీ డిజిటల్ మహానాడుకు హాజరైన లోకేష్‌.. స్లిమ్‌గా కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

తాత ఎన్టీఆర్, నాన్న చంద్రబాబు బాటలో రాజకీయ రంగప్రవేశం చేసిన నారా లోకేష్‌ను తప్పుబట్టేందుకు.. ప్రత్యర్థులు ప్రతిక్షణం కాచుక్కూర్చుంటారు. అయితే, వారికి ఏమాత్రం అవకాశం ఇవ్వొద్దని భావిస్తున్నారు నారా లోకేష్‌. ఇందులో భాగంగా భాషపై పట్టు పెంచుకుంటూనే.. బాడీ షేమింగ్‌పైనా దృష్టి పెట్టారు. లాక్‌డౌన్ సమయంలో ఏకంగా 20 కేజీలు తగ్గారు. లోకేష్‌ను కొత్త లుక్‌లో చూసిన పార్టీ నేతలంతా షాక్‌ అయ్యారు. క్రమం తప్పకుండా వర్కవుట్స్, డైట్‌తో బరువు తగ్గానని పార్టీ నేతలకు వివరించారు నారా లోకేష్. లాక్‌డౌన్‌లో అందరూ లావుగా తయారైతే.. లోకేష్‌ మాత్రం స్లిమ్‌గా తయారై అందర్నీ ఆశ్చర్యపరిచారు.

అటు, నారా లోకేష్‌ ఇటీవలికాలంలో తెలుగులోనూ చక్కగా మాట్లాడుతున్నారు. గతంలో కొన్ని తెలుగు పదాలు ఉచ్చరించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన.. మాతృ భాషపై మరింత పట్టు పెంచుకున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి ప్రత్యర్థుల ఎదురుదాడిని పాజిటివ్‌గా తీసుకున్న నారా లోకేష్.. న్యూలుక్‌తో పాటు.. భాషపై పట్టు పెంచుకని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు.

Tags

Read MoreRead Less
Next Story