ప్రేమికుల్ని పెళ్లితో ముడివేసిన క్వారంటైన్

ప్రేమికుల్ని పెళ్లితో ముడివేసిన క్వారంటైన్

కరోనా లక్షణాలతో క్వారంటైన్‌లో అడుగుపెట్టారు ఆ ప్రేమికులు.. వారిద్దరికీ వివాహం చేసి పంపించారు నిర్వాహకులే పెళ్లి పెద్దలుగా మారి. ఒడిశా రాష్ట్రం పూరి జిల్లా సాగాడ గ్రామానికి చెందిన సౌరబ్ దాస్.. అదే గ్రామానికి చెందిన పింకి రాణి ప్రేమించుకున్నారు. పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోరని భావించిన ప్రేమికులు ఈ ఏడాది జనవరిలో గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ పారిపోయారు. సౌరబ్ అక్కడే ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో పని చేస్తూ ప్రేయసితో సహజీవనం చేస్తున్నాడు.

ఈ క్రమంలో లాక్డౌన్ వచ్చి పరిశ్రమ మూత పడింది. దీంతో వారు అనేక ఇబ్బందులు పడి సొంత గ్రామం సాగాడ చేరుకున్నారు. అయితే వారు గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చారని తెలుసుకుని ఇద్దరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ఎందుకైనా మంచిదని వారిద్దరినీ 14 రోజులు క్వారంటైన్‌‌లో ఉంచారు అధికారులు. క్వారంటైన్ సమయం ముగిశాక క్వారంటైన్ కేంద్రంలోనే ప్రేమికులిద్దరికీ పెళ్లి చేశారు నిర్వాహకులు. ఇన్‌చార్జులుగా ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు వధూవరుల తల్లిదండ్రులుగా వ్యవహరించారు. సాగాడ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుడు, ఆశా వర్కర్, అంగన్ వాడీ వర్కర్ల సమక్షంలో వారి వివాహం జరిగింది. అనంతరం మళ్లీ ఒకసారి కరోనా టెస్ట్ చేసి నెగిటివ్ రావడంతో కొత్త జంటను ఇంటికి పంపిచారు అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story