రోజూ ఓ కప్పు 'ఘీ' కాఫీ.. రకుల్ చెప్పిన బ్యూటీ సీక్రెట్

రోజూ ఓ కప్పు ఘీ కాఫీ.. రకుల్ చెప్పిన బ్యూటీ సీక్రెట్
X

ఫిట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్ హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలంలోనే టాప్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. తనకు ఇష్టమైనవి నటించడం, ఆహారం, జిమ్‌లో వర్కవుట్లు అని పలు సందర్భాల్లో రకుల్ చెబుతుంటుంది. లాక్డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయినా ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ.. హోమ్ వర్కవుట్లు చేస్తూ, గేమ్స్ ఆడుతూ, సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తోంది. ఇంట్లో ఉంటున్నా బాడీ మీద కాన్సన్‌ట్రేషన్ చేస్తూ తన ఆరోగ్యాన్నీ, అందాన్నీ కాపాడుకుంటోంది. తాజాగా తన మార్నింగ్ రొటీన్ గురించి తెలియజేస్తూ ఓ వీడియోని పోస్ట్ చేసింది. ప్రతి రోజూ ఈ విడియోలో చెప్పినట్లు పాటిస్తానని.. నన్ను అభిమానించే నా ఫ్యాన్స్ కూడా పాటిస్తే ఆరోగ్యం మీ సొంతం అని తెలియజేస్తోంది.

ఉదయం నిద్ర లేవగానే అరలీటరు గోరువెచ్చని నీరు తాగుతాను. కొంత సమయం తర్వాత రాత్రిపూట నానబెట్టిన మెంతులు, నల్లని ఎండు ద్రాక్షను తీసుకుంటాను. ఈ రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటోంది. మెంతులు తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. మరోవైపు నల్లని ఎండుద్రాక్ష తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా మారతాయి. వాటిల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. నల్లని ఎండు ద్రాక్ష మహిళలకు ఎంతో అవసరం. ఆ తర్వాత ఓ కప్పు ఘీ కాఫీ తాగుతాను. ఇది నాకు చాలా ఇష్టమైన డ్రింక్. ఇది లేకుండా నా రోజు ప్రారంభం కాదు. రెండేళ్ల నుంచి ఈ కాఫీ తాగడం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడది నా జీవితంలో భాగమైపోయింది అని రకుల్ తన బ్యూటీ సీక్రెట్ చెప్పారు.

Next Story

RELATED STORIES