మహారాష్ట్రలో 116 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్

మహారాష్ట్రలో 116 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్
X

గత 24 గంటల్లో మహారాష్ట్రలోని 116 మంది పోలీసు సిబ్బందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. అలాగే గతంలో కరోనా భారిన పడిన ముగ్గురు పోలీసు సిబ్బంది మరణించారు. తాజా కేసులతో, మహారాష్ట్రలో కరోనా సోకిన పోలీసుల సంఖ్య 2,211 కి పెరిగింది. ఇందులో ఇప్పటివరకు 25 మంది మరణించారు. మరోవైపు మహారాష్ట్రలో కొత్తగా 2,598 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం కేసుల సంఖ్య 59,546 కు చేరుకుంది. అలాగే గురువారం 85 మరణాలు సంభవించాయి. దీనితో, రాష్ట్ర మరణాల సంఖ్య 1,982గా ఉంది. గత మూడు రోజుల్లో రాష్ట్రంలో 287 మంది మరణించారు.

Next Story

RELATED STORIES