ఇప్పటి వరకు జగన్ సర్కార్‌కు 65 కేసుల్లో వ్యతిరేక తీర్పులు

ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వివాదంలో హైకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నే కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిమ్మగడ్డ తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కూడా ధర్మాసనం స్పష్టతనిచ్చింది. అలాగే ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వివాదంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు అత్యంత కీలకమైనదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో 65 కేసుల్లో వ్యతిరేక తీర్పులు వచ్చాయి. అయితే.. ఎన్నికల కమిషనర్ పదవీ కాలం కుదింపు ఆర్డినెన్స్ విషయంలో వచ్చిన తీర్పు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కేసులో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 13 మంది పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల నిర్వహణలో సంస్కరణల కోసమే తాము ఆర్డినెన్స్ తీసుకొచ్చామని వాదించిన ప్రభుత్వం. అయితే..హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ వాదనతో విభేదించింది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..ఎన్నికల నిర్వహణ వాయిదా తర్వాత ఉన్నఫళంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను తప్పుబట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com