భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
X

భారత్ లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా 7,466 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. దీంతో భారత్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,65,799కి చేరింది. అంతేకాకుండా 175 మంది మృతిచెందారు. దాంతో ఇప్పటివరకూ మొత్తం 4,706 మరణాలు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. మరోవైపు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇప్పటివరకు 71,105 మంది కోలుకుని కోవిడ్ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 89,987 మంది చికిత్స పొందుతున్నారు.. ఇక దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో, గుజరాత్‌లలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. కాగా దేశంలో ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

Next Story

RELATED STORIES