హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని బతికించింది: సీపీఐ రామకృష్ణ

ఎల్జీ పాలిమర్స్ బాధితులకు న్యాయం జరిపించే అంశంలో ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకుంటామన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో పర్యటించిన ఆయన.. లాక్‌డౌన్ నిబంధనలకు లోబడి బాధితులు చేస్తున్నపోరాటం ఆదర్శనీయమన్నారు. యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు, బాధితులకు జరగాల్సిన న్యాయంపై హైకోర్టులో తమ పార్టీ తరపున పిల్ వేయనున్నట్టు రామకృష్ణ తెలిపారు.
అటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కోర్టు తీర్పుపై స్పందించిన ఆయన ఈ విషయంలో ఆనందంగా ఉందన్నారు. SEC అధికారాలనే జగన్ ధిక్కరించిన నేపథ్యంలో.. కోర్టు తీర్పు ఆయనకు చెంప పెట్టన్నారు. హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని బతికించిందన్నారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం మొదటి నుంచి చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కోర్టులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. కోర్టు ఉల్లంఘనలకు గురవుతున్నారని రామకృష్ణ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com