ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్‌ జోగి కన్నుమూత

ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్‌ జోగి కన్నుమూత
X

ఛత్తీస్ గడ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కన్నుమూశారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. ఛత్తీస్ గడ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన అజిత్ జోగి, 2000 నుంచి 2003వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భోపాల్ మౌలానా ఆజాద్ కాలేజ్ లో చదివిన జోగి, 1981 నుంచి 1985 మధ్య భోపాల్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీల్లో చేరి వివిధ హోదాల్లో బాధ్యతలు చేపట్టారు. అజిత్ జోగి మృతిపట్ల కాంగ్రెస్ నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES