తాజా వార్తలు

తప్పించుకున్న చిరుత.. సీసీటీవీ కెమెరాలో..

తప్పించుకున్న చిరుత.. సీసీటీవీ కెమెరాలో..
X

హైదరాబాద్‌ శివార్లలోని రాజేంద్రనగర్‌ చుట్టుపక్కల చిరుతపులి సంచరిస్తోంది. ఈ మధ్యే ఆరాంఘర్‌ బ్రిడ్జి దగ్గర.. నడిరోడ్డుపై కనిపించిన చిరుత.. స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఓ లారీ డ్రైవర్‌ను గాయపరిచింది. అటువైపు ఉన్న ఓ ఫాంహౌస్‌లోకి దూరిన చిరుత.. తర్వాత కనిపించలేదు. హిమాయత్‌ సాగర్‌ పరిసర ప్రాంతాల్లో అడుగు జాడలు గుర్తించారు. కానీ.. అది ఎటువైపు వెళ్లింది.. ఎక్కడ తిరుగుతోందో గుర్తించలేకపోయారు. ఇన్నాళ్ల తర్వాత ఆ చిరుత మళ్లీ కనిపించింది. సీసీటీవీ కెమెరాలకు చిక్కింది.

రాజేంద్రనగర్ పరిధిలోనే చిరుత సంచరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ప్రొఫెసర్ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ-మేనేజ్‌కు వెళ్లే దారిలో చిరుత తిరుగుతోంది. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన వర్సిటీ సెక్యూరిటీ గార్డులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చిరుత సంచారం దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో.. సమీపంలోని కాలనీల ప్రజలను అప్రమత్తం చేశారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Next Story

RELATED STORIES