ఎవరీ చందన్.. ఎంతబాగా పాడాడు బాహుబలి సినిమాలో పాటని..: 5.9 మిలియన్ల వ్యూస్

ఎవరీ చందన్.. ఎంతబాగా పాడాడు బాహుబలి సినిమాలో పాటని..: 5.9 మిలియన్ల వ్యూస్
X

సోషల్ మీడియా మనలో ఉన్న కళని నలుగురికీ పరిచయం చేసుకోవడానికి ఓ మంచి వేదిక. అది ఓ నలుగురి నోళ్లలో నానితే నాలుగు అవకాశాలూ తెచ్చిపెడుతుంది. అదృష్టం బావుంటే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమూ ఉండదు. ఇంజనీరింగ్ చదివిన చందన్ కుమార్ గుప్తాకి పాటలంటే చాలా ఇష్టం. సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నాడు. ఇంజీనీరింగ్ చదివిన మనసు పాటవైపే పరుగులు పెడుతోంది.

చందన్ అభిరుచిన గుర్తించిన స్నేహితులు అతడి చేత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రంలోని ఎవడంట.. ఎవడంట పాటను పాడించి ఆ వీడియోను నెట్టింట్లో పోస్ట్ చేశారు. అది అతి కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది. ఇప్పటికే 5.9 మిలియన్ల మంది ఆ వీడియోను చూశారు. 15వేల మంది ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టారు. చందన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో ప్లేబ్యాక్ సింగర్‌గా ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. ఉస్తాద్ రషీద్, నుస్రత్ ఫతే అలీఖాన్, కైలాష్ ఖేర్‌లు అంటే అభిమానం అని అన్నాడు.

Next Story

RELATED STORIES