తొలకరి జల్లులు కురిసే సమయం.. రాబోయే 5 రోజులలో నైరుతి రుతుపవనాలు

తొలకరి జల్లులు కురిసే సమయం.. రాబోయే 5 రోజులలో నైరుతి రుతుపవనాలు

మే 31 నుంచి జూన్ 4 వరకు ఆగ్నేయ మరియు ఆనుకొని ఉన్న తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా కేరళపై నైరుతి రుతుపవనాల ప్రారంభానికి జూన్ 1 నుండి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉందని గురువారం (మే 28) భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

నైరుతి రుతుపవనాలు మాల్దీవులు-కొమొరిన్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలకు చేరుకుంటాయి. దక్షిణ బంగాళాఖాతంలో కొన్ని భాగాలు, అండమాన్ నికోబార్ దీవుల మిగిలిన భాగాలకు రుతుపవనాలు చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో ఇది దక్షిణ ఒమన్ మరియు తూర్పు యెమెన్ తీరం వైపు వాయువ్య దిశగా వెళ్ళే అవకాశం ఉంది.

2020 మే 29 నుండి 2020 జూన్ 1 వరకు పశ్చిమ-మధ్య అరేబియా సముద్రంలోకి ప్రవేశించవద్దని భారత వాతావరణ శాఖ మత్స్యకారులను హెచ్చరించింది.

Tags

Read MoreRead Less
Next Story