దయచేసి మీరు మాత్రం రైలెక్కొద్దు: రైల్వేశాఖ విజ్ఞప్తి

దయచేసి మీరు మాత్రం రైలెక్కొద్దు: రైల్వేశాఖ విజ్ఞప్తి

కరోనా కాలం. ఎన్ని రోజులని ఇంట్లో కూర్చుంటాం. అలాగని ధైర్యం చేసి బయటకు రావాలన్నా భయం వేస్తుంది. కానీ తప్పదు. జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలి. కానీ గర్భిణులు, పదేళ్లలోపు చిన్నారులు, వృద్ధులు మాత్రం ఆ రిస్క్ తీసుకోవద్దంటోంది రైల్వే శాఖ. ప్రయాణాలకు దూరంగా ఉండమని విజ్ఞప్తి చేస్తోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్య సేవలు పొందుతున్న వ్యక్తులను ప్రయాణాలు చేయవద్దని కోరింది. శ్రామిక్ రైళ్లలో పెద్ద ఎత్తున వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేరుస్తున్న నేపథ్యంలో రైల్వేశాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. హైపర్ టెన్షన్, మధుమేహం, కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారిని, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిని ప్రయాణాలు చేయొద్దని ప్రకటనలో పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story