ఇంట్లో ఉన్నా మాస్క్ ధరిస్తే వైరస్..

ఇప్పటి వరకు బయటకు వెళ్తేనే మాస్క్ కచ్చితంగా ధరించాలనే వారు. ఇప్పుడు ఇంట్లో ఉన్నా మాస్క్ పెట్టుకోవాలంటున్నారు. బయటకు వెళ్లి వచ్చిన వారు ఇంటికి రాగానే మాస్క్ తీసివేస్తుంటారు. ఇది ఎంతమాత్రం తగదని చెబుతున్నాయి పరిశోధనలు. గ్లోబల్ హెల్త్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం ఇంట్లో ఉండి మాస్క్‌ని ధరిస్తే 79 శాతం వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చని చెబుతున్నారు. ఇంటిని కూడా ప్రతి రోజు బ్లీచ్ వేసి శుభ్రపరచడం ద్వారా 77 శాతం ప్రభావంతంగా ఉంటుందని అంటున్నారు.
బయటకు వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వల్ల వైరస్ వ్యాప్తిని నిరోధించగలమన్నారు. ఇంట్లోని వ్యక్తుల మధ్య కనీసం 3 అడుగులు సామాజిక దూరం పాటించడం వంటి చర్యలు తీసుకోవడం వల్ల మిగతా వారికి వైరస్ సోకలేదని పరిశోధకులు గుర్తించారు. ఇక ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఒక్కచోట చేరి భోజనం చేయడం, టీవీ చూడడం వల్ల వైరస్ సోకే ప్రమాదం 18 శాతం ఎక్కువ ఉన్నట్లు ఈ సర్వే తెలిపింది. అయితే రెండు సంవత్సరాలకంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు మాస్కులు ధరించడం ప్రమాదకరమైనదని జపాన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com