భర్త స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని భార్య..

భర్త స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని భార్య..
X

అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు. అయినా వారు కూడా గుర్తు రాలేదు ఆత్మహత్య చేసుకునే ముందు ఆ తల్లికి. భర్త స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదనే చిన్న కారణానికి ప్రాణాలు బలి తీసుకుంది. చిన్నారులను తల్లి లేని బిడ్డలను చేసింది. ఢిల్లీలోని మైదాన్ గర్హి ప్రాంతానికి చెందిన జ్యోతి అనే మహిళ ఒంటికి నిప్పంటించుకుంది. 90 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరగా అప్పటికే మరణించిందని వైద్యులు తేల్చారు.

గత కొన్ని రోజులుగా జ్యోతి స్మార్ట్ ఫోన్ కొనివ్వమని భర్తను అడుగుతోంది. దీని గురించి భార్య భర్తలు ఇద్దరు గొడవ కూడా పడుతుండేవారు. ఇక లాభం లేదని గొడవ మరీ శృతి మించుతోందని భావించిన భర్త లాక్డౌన్ అయిన తరువాత కొంటానని చెప్పాడు. అయినా ఆగ్రహం చల్లారని జ్యోతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏడేళ్ల క్రితమే జ్యోతికి వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES