మహారాష్ట్రలో 114 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్

మహారాష్ట్రలో 114 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్
X

మహారాష్ట్రలో కరోనావైరస్ విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు.. గత 24 గంటల్లో మహారాష్ట్రలోని 114 మంది పోలీసు సిబ్బందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. అలాగే గతంలో కరోనా భారిన పడిన 1 పోలీసు సిబ్బంది మరణించారు. తాజా కేసులతో, మహారాష్ట్రలో కరోనా సోకిన పోలీసుల సంఖ్య 2,325 కి పెరిగింది. ఇందులో ఇప్పటివరకు 26 మంది మరణించారు. మరోవైపు గత 24 గంటల్లో భారత్‌లో 7,964 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కొరోనావైరస్ కేసులు 1.73 లక్షలకు పైగా పెరిగాయి. మరణించిన వారి సంఖ్య 4,971, నయమైన కేసుల సంఖ్య 82,370 కు పెరిగింది.

Next Story

RELATED STORIES