coronavirus : యుఎస్‌లో మరో 1225 మంది మృతి

coronavirus : యుఎస్‌లో మరో 1225 మంది మృతి
X

యుఎస్‌లో కరోనావైరస్ ద్వారా 24 గంటల్లో 1225 మంది మరణించారు. దీంతో అమెరికాలో మరణించిన వారి సంఖ్య లక్షా 4వేల 542 గా నమోదయింది. అలాగే కరోనాకు ఎక్కువగా ప్రభావితమైన న్యూయార్క్ లో జూన్ 8 నుండి లాక్ డౌన్ ఆంక్షల్లో సడలింపులు ఉంటాయని న్యూయార్క్ ప్రభుత్వం పేర్కొంది. దీంతో దాదాపు నాలుగు లక్షల మంది తమ పనులకు వెళ్తారని గవర్నర్ ఆండ్రూ క్యూమో తెలిపారు. వారికోసం బస్సులు, రైళ్లు కూడా తిరుగుతాయని.. వాటిని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడం జరుగుతుందని వెల్లడించారు.

ప్రజా రవాణా వ్యవస్థ ప్రజలకు పూర్తిగా సురక్షితం అవుతుందని అన్నారు. కాగా జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ఇప్పుడు దేశంలో సోకిన వారి సంఖ్య 17 మిలియన్లను దాటింది. కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించన ఏకైక దేశంగా అమెరికా నిలిచింది.

Tags

Next Story