రెండు సార్లు కంపించిన భూమి.. ఇళ్లలోంచి బయటికి వచ్చిన జనం

రెండు సార్లు కంపించిన భూమి.. ఇళ్లలోంచి బయటికి వచ్చిన జనం

అసలే ఓ వైపు రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులతో భయపడుతున్న ఢిల్లీ వాసుల్ని రెండు సార్లు ఓ మోస్తరు భూకంపం మరింతగా వణికించింది. ఒక్కసారిగా భయాందోళనలకు గురైన ప్రజలు కొన్ని చోట్ల ఇళ్లలోంచి బయిటికి వచ్చారు. శుక్రవారం రాత్రి 9 గంటల 8 నిమిషాలకు తొలి భూకంపం వచ్చింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.6గా నమోదైంది. హర్యానాలోని రోహతక్‌లో భూకంప కేంద్రం ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్‌ సెస్మాలజీ తెలిపింది. ఆ తర్వాత రాత్రి 10 గంటలకు రెండో సారి భూమి కంపించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 2.9గా నమోదైంది.

కొన్ని సెకన్లపాటు ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కొనసాగాయి. ఢిల్లీకి వాయువ్య దిశలో 49 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. మే 10న 3.4, మే 15న 2.2 మాగ్నిట్యూడ్‌తో భూమి స్వల్పస్థాయిలో కంపించింది. వరుస భూప్రకంపనలపై ఢిల్లీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story